// అగ్ని //
దశరథుడికి సాక్షాత్కరించి అగ్ని ఒసగె వరం
రావణ సంహారంతో జరిగె లోకకళ్యాణం
చక్రధారి చేతిలోని 'సుదర్శనం' అగ్ని ప్రసాదం
లయకారుడి ప్రత్యేక నేత్రం అగ్నికణాల సమూహం!!
అనాది నుండి సృష్టి ,అగ్నిలది విడదీయరాని బంధం
సాక్షాత్తు ఆ ప్రత్యక్ష్య నారాయణుడే ఒక మండే గోళం
ఉల్కాపాతం,పర్వత విస్ఫోటనం అంతా జ్వాలామయం
అణ్వస్త్ర ప్రయోగాలు ,క్షిపణి పరీక్షలు అగ్నితోనే ప్రారంభం
శుభకార్యాలలో, యాగాలలో తప్పదు అగ్ని ప్రజ్వలనం
మంగళ హారతికైనా , కాష్టానికైనా ఉండేది నిప్పు కణం!!
వాడుకభాషలోనూ అగ్నిది ప్రత్యేక స్థానం
నిరంకుశత్వాన్నితరిమికొట్టును విప్లవాగ్ని
అజ్ఞానాన్ని పారద్రోలేది చైతన్యాగ్ని
కదనరంగాన ఉండేది పౌరుషాగ్ని
ఆత్మసాక్షాత్కారం ఒక జ్యోతి స్వరూపం
అగ్ని అంటేనే జ్ఞానానికి సంకేతం!!
No comments:
Post a Comment